: అవగాహన లేకే మా ఉత్పత్తులపై ఫత్వా జారీ చేశారు: పతంజలి
పతంజలి ఉత్పత్తులను గో మూత్రంతో తయారు చేస్తున్నారని తమిళనాడుకు చెందిన ముస్లిం మత సంస్థలు ఫత్వా జారీ చేయడంపై 'పతంజలి ఆయుర్వేద్' స్పందించింది. ఫత్వా జారీ చేసిన సంస్థ ఏదైనా, అవగాహన చేసుకోవటంలో పొరపాటు ఉందని పతంజలి తరపున బాబా రాందేవ్ శిష్యుడు బాలకృష్ణ అన్నారు. తమ ఉత్పత్తుల విషయంలో ఎన్నడూ గోప్యత పాటించలేదని స్పష్టం చేశారు. తమ సంస్థ మార్కెట్ చేస్తున్న 700కి పైగా ఉత్పత్తుల్లో కేవలం ఐదింటిలోనే గోమూత్రాన్ని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. గోమూత్రం వాడిన ఆయా ఉత్పత్తులపై ఆ విషయాన్ని పొందుపరిచామని తెలిపారు.