: 2016లో ప్రయాణానికి సిద్ధమా? లాంగ్ వీకెండ్లు ఇవిగో..!


2016లో ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని అనుకుంటున్నారా? లేక మరేదైనా టూరిజం ప్రాంతాలకు, ఇంకెక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? శని, ఆదివారాలకు తోడు మరొక్క సెలవు పక్కనే వస్తే బాగుంటుంది కదా? అలా కలిసొచ్చే లాంగ్ వీకెండ్ వివరాలివి * మార్చి 7 సోమవారం మహాశివరాత్రి. ముందువచ్చే శని, ఆదివారాలతో కలిపి 3 రోజుల సెలవులు వస్తాయి. * మార్చి 25న గుడ్ ఫ్రైడే. మరో సెలవును గురువారం లేదా సోమవారం పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లిరావచ్చు. * ఏప్రిల్ 15న శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం. ఆపై రెండు రోజులు కూడా సెలవులే. * ఆగస్టు 15న సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం కాగా, ముందు రెండు రోజులు సెలవు. ఇక మరోరోజు ఎటైనా కలుపుకోగలిగితే నాలుగు రోజుల వరుస సెలవులు లభిస్తాయి. * ఇక వినాయకచవితి సెప్టెంబర్ 5 సోమవారం నాడు వచ్చింది. చవితికి ముందు కూడా రెండు సెలవులు కలిసొస్తాయి * బక్రీద్ పండగ సెప్టెంబర్ 12న సోమవారం వస్తుంది. అప్పుడూ రెండు రోజులు కలిసొస్తాయి. * ఇక ఈ రెండు పండగల మధ్యా 4 రోజుల సెలవు పెట్టుకోగలిగితే, వరుసగా 10 రోజుల సెలవు కలిసొస్తుంది. సెప్టెంబర్ 3 నుంచి 12 వరకూ. * నవంబర్ 14న గురునానక్ జయంతి ముందుకూడా శని, ఆదివారాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News