: డబ్ స్మాష్ లో ఆనంద్ మహీంద్రా!... కింగ్ ఖాన్ ను అనుకరించిన పారిశ్రామిక దిగ్గజం
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేటి ఉదయం ట్విట్టర్ లో సరికొత్తగా ప్రత్యక్షమయ్యారు. తన కంపెనీ కొత్త మోడల్ ‘కేయూవీ 100’ విడుదలను పురస్కరించుకుని ఆయన ‘డబ్ స్మాష్’ వీడియోను పోస్ట్ చేశారు. సదరు వీడియోలో ఆనంద్ మహీంద్రా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ను అనుకరించారు. తొలిసారి డబ్ స్మాష్ లో కనిపించిన మహీంద్రా, తనదైన శైలిలో కింగ్ ఖాన్ డైలాగును ఓ రేంజీలో చెప్పారు. తన డబ్ స్మాష్ వీడియో షారుఖ్ ఖాన్ ను తప్పనిసరిగా ఇంప్రెస్ చేసి తీరుతుందని కూడా మహీంద్రా సదరు వీడియోకు కామెంట్ ను జత చేశారు.