: ప్రత్యేకహోదాపై త్వరలో ప్రధాని ప్రకటన: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రకటన చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నీతి ఆయోగ్ కమిటీ ప్రత్యేకహోదాపై ప్రధానికి నివేదిక అందజేసిందని అన్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆయన చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం విజయవాడను క్రైం సిటీ అని, అమరావతిలో పర్యావరణ సమస్య నెలకొందని కొంత మంది ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు రావొద్దని, అమరావతి పూర్తి కావొద్దని ప్రతిపక్షం కోరుకుంటోందని ఆయన తెలిపారు.