: దోషిగా తేలితే బంగ్లా క్రికెటర్ కెరీర్ ఖతం


పనిమనిషిని హింసించిన కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు దోషులుగా తేలితే అతని కెరీర్ నాశనమైనట్టేననే వాదనలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తరపున 38 టెస్టులు, 51 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన షహదత్ హుస్సేన్, అతని భార్య నృటో షహదత్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు పోలీసులు తెలిపారు. షహదత్ హుస్సేన్ దంపతుల ఇంట్లో పని చేస్తున్న 11 ఏళ్ల బాలికను వేధించి, హింసించినట్టు నమోదైన కేసులో భాగంగా వారిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణలో బాలికను హింసించిన మాట వాస్తవమని తేలిందని పోలీసులు తెలిపారు. అయితే తానెలాంటి తప్పు చేయలేదని, తన కెరీర్ ను నాశనం చేయడానికి పన్నిన కుట్ర అని షహదత్ ఆరోపిస్తున్నాడు. ఈ కేసులో షహదత్ దంపతులు దోషులుగా తేలితే వారికి 14 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News