: సైబర్ నేరగాళ్లు అరెస్టు.. నగదు, ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు స్వాధీనం!


హైదరాబాద్ లో 10 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. నిందితులకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల నుంచి ఎటువంటి లావాదేవీలు జరగకుండా నిలిపివేశామన్నారు. నిందితులకు సంబంధించిన పలు బ్యాంకు అకౌంట్లలో సుమారు రూ.75 లక్షల వరకు ఉన్నాయని చెప్పారు. నిందితుల నుంచి రూ.7.3 లక్షలు, 3 ల్యాప్ టాప్ లు, 37 సెల్ ఫోన్లు, 11 హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రభాకర్ రావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News