: 'జూ' సిబ్బందిని అవాక్కయ్యేలా చేసిన సింహం


సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ లో ద్రకెన్ స్టన్ లయన్ పార్కులో సిబ్బందిని ఓ మగ సింహం అవాక్కయ్యేలా చేసింది. ఈ జూ నాన్ బ్రీడింగ్ పార్క్ అని సిబ్బంది పేర్కొంటారు. అంటే ఇక్కడికి వచ్చే మగ జంతువులకు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేస్తారు. తద్వారా తోటి జంతువులతో లైంగిక సంబంధం ఏర్పడినా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రూటుస్ అనే మగ సింహాన్ని ఈ జూకు సిబ్బంది తీసుకుని వచ్చారు. దీనికి కూడా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేశారు. నాలా అనే ఆడ సింహంతో అది సన్నిహితంగా ఉండేది. ఎప్పట్లాగే క్రిస్మస్ ముందు జూకు తాళం వేసి వెళ్లిన సిబ్బందికి మూడు బుజ్జి తెల్ల సింహం పిల్లలు కనిపించాయి. దీంతో అవాక్కయిన జూ సిబ్బంది, దీనికి కారణం ఏంటని బ్రూటుస్ కి వైద్య పరీక్షలు నిర్వహించగా, దానికి నిర్వహించిన వ్యాసెక్టమీ ఆపరేషన్ విఫలమైందని తేలింది. దాని ఫలితంగా నాలా మూడు సింహం పిల్లలకు తల్లైందని తేల్చారు. దీంతో బ్రూటుస్ కి రెండోసారి వ్యాసెక్టమీ ఆపరేషన్ నిర్వహించారు. దీనిపై స్థానిక మీడియా క్రిస్మస్ మిరాకిల్ అని, నాన్ బ్రీడింగ్ పార్క్ లో అద్భుతం జరిగిందని వార్తను కూడా ప్రచురించిందని జూ యజమాని తెలిపారు.

  • Loading...

More Telugu News