: కేరళలో మఠాన్ని సందర్శించిన సోనియా!
కేరళ రాష్ట్రంలోని శివగిరి మఠాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈరోజు సందర్శించారు. సోనియా వెంట కేరళ సీఎం వూమెన్ చాందీ కూడా ఉన్నారు. వర్కశళలోని శివగిరి మఠంలో వార్షిక తీర్థయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శివగిరి మఠం నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మార్చి 13, 1925న ఈ మఠంలో మహాత్మాగాంధీ ప్రసంగానికి సంబంధించిన పత్రాలతో పాటు ప్రముఖ గురువు శ్రీ నారాయణ గురు చిత్రపటాన్ని ఆమెకు కానుకగా అందజేశారు. కేరళ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కేసీ జోసఫ్ అరుదైన కానుకను సోనియాకు అందజేశారు.