: తిరుపతిలో కారులో ఉంచిన రూ.30 లక్షలు చోరీ


తిరుపతిలో పార్క్ చేసిన ఓ కారులోని రూ.30 లక్షలు చోరీకి గురయ్యాయి. తిరుమలలోని సారంగి హోటల్ కు చెందిన మోహన్ నగదు తీసుకుని తిరుపతిలోని శ్రీదీవి కాంప్లెక్స్ కు వచ్చాడు. అతని వెంట అసిస్టెంట్ భాను ప్రకాశ్ కూడా వచ్చాడు. అసిస్టెంట్ ను కారులోనే ఉంచి మోహన్ కాంప్లెక్స్ లోకి షాపింగ్ కు వెళ్లాడు. అప్పుడు ఓ వ్యక్తి భాను ప్రకాశ్ వద్దకు వచ్చి కింద కర్చీఫ్ పడిపోయిందని, అందులో పది రూపాయలు ఉన్నాయని చెప్పాడు. అది నమ్మిన భాను కిందికి దిగి చూస్తుండగానే కారులో ఉన్న ముప్పై లక్షలను ఆ వ్యక్తి తీసుకుపోయాడు. వెంటనే హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News