: ఏపీలో నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం


కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నూతన ఇసుక విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి నూతన ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రసవం తరువాత తల్లీబిడ్డలను ఇంటికి చేర్చేందుకు 102 టోల్ ఫ్రీ నంబర్ సేవలు ప్రారంభించనున్నారు. ఈ సేవలను జనవరి 1వ తేదీన సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తారని తెలిసింది.

  • Loading...

More Telugu News