: నాకే ఎక్కువ ప్రజాదరణ ఉంది: డోనాల్డ్ ట్రంప్


సంచలన వ్యాఖ్యలు, స్పష్టమైన ప్రకటనలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ జె ట్రంప్ తనకే ఎక్కువ ప్రజాదరణ ఉందన్నారు. ఇప్పటివరకు తాను చాలా తక్కువ ఖర్చు పెట్టానని, అయినప్పటికీ ప్రజాదరణలో తొలి స్ధానంలో ఉన్నానని తెలిపారు. తనకు 40 శాతం ప్రజాదరణ ఉంటే, తరువాతి స్థానంలో ఉన్న అభ్యర్థికి కేవలం 13 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఖర్చు పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. వచ్చే వారం నుంచి ఏడురోజులకు గాను 2 మిలియర్ డాలర్లు (రూ.13.27 కోట్లు) ప్రకటనలకు ఖర్చు పెట్టనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఎన్నికల పూర్తి స్థాయి ప్రచారానికి మొత్తంగా రూ.232 కోట్లు ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రచారం కోసం జెబ్ బుష్ ఇప్పటికే రూ.391 కోట్లు ఖర్చు పెట్టినా అంతగా ఆదరణ లేదన్నారు.

  • Loading...

More Telugu News