: డాన్సు నేర్చుకోవాలని ఎంతో అనుకున్నా, అమ్మానాన్నా నేర్పించలా!: తెలంగాణ ఉప సభాపతి పద్మ


తనకు చిన్నతనంలో నృత్యం నేర్చుకోవాలని ఎంతో కోరికగా ఉండేదని, కానీ తల్లిదండ్రులు నేర్పించలేదని తెలంగాణ రాష్ట్ర ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలను తిలకించిన అనంతరం ప్రసంగించారు. నృత్యంతో ఏకాగ్రత పెరిగి, తద్వారా లక్ష్యాన్ని సాధించే శక్తి సిద్ధిస్తుందని ఆమె అన్నారు. తాను డాన్స్ నేర్చుకోలేకపోయానని, అయితే, ఇక్కడి చిన్నారుల నృత్యాలను చూస్తూ ముగ్ధురాలినవుతున్నానని అన్నారు. నేటి తరం పెద్దలు తమ పిల్లలకు సంప్రదాయ నృత్యాలను నేర్పించేందుకు ఆసక్తి చూపుతుండటం సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన గణపతి కౌథమ్, రామాయణ శబ్దం, జతిస్వరం, మంగళం, తిల్లానా తదితర నృత్యాంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News