: కేజ్రీవాల్! నీకు రాజ్యాంగం తెలుసా?: బీజేపీ నేతల మండిపాటు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై యుద్ధం ప్రకటించిన కేజ్రీవాల్, ఆయన డీడీసీఏ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయిస్తున్నారు. ఇందుకోసం మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీడీసీఏలో కేవలం ఆర్థిక కోణం మాత్రమే కాదు, లైంగిక వేధింపులు కూడా ఉన్నాయంటూ నేడు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కేజ్రీవాల్ చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. కేజ్రీవాల్ కు రాజ్యాంగం తెలియదని, ఆయన చట్టవ్యతిరేకమైన పనులు చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.