: ఐఎస్ఐఎస్ చీఫ్ బగ్దాదీ పిలుపుకి నెటిజన్ల వ్యంగ్య సమాధానాలు!


ఐఎస్ఐఎస్ లో చేరేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు కదిలి రావాలని పిలుపునిచ్చిన ఐఎస్ చీఫ్ అబూబకర్ అల్ బగ్దాదీకి నెటిజన్లు తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో సృజనాత్మకంగా వ్యంగ్యం, విమర్శలు ఎక్కుపెట్టే నెటిజన్లు అల్ బగ్దాదీ పిలుపుకి స్పందించారు. 'స్టార్ వార్స్ సినిమా చూడాలి..అందుకే రిస్క్ చేయలేను' అని ఒకరు అతని పిలుపుని తిరస్కరిస్తే, ఇంకో నెటిజన్ 'సారీ, నాన్న గారు రాత్రి 8 గంటలకల్లా ఇంట్లో ఉండాలని ఆజ్ఞాపించారు. అందుకే నీ పిలుపుకి స్పందించలేను' అంటూ సమాధానమిచ్చారు. దీనికి సమాధానంగా మరో నెటిజన్ స్పందిస్తూ, 'నెట్ ఫ్లెక్స్ లో సినిమా చూస్తున్నాను...ఫుల్ బిజీ' అని చెప్పాడు. ఇంకో వ్యక్తి 'మా అమ్మ నా కోసం మంచి వంటకం తయారు చేసింది. ఇప్పటికైతే రాలేను, మరోసారి చూద్దాం' అంటూ వ్యంగ్యమైన సమాధానాలు చెబుతున్నారు. కాగా, ఐఎస్ లో భారతీయుల పట్ల తీవ్రమైన వివక్ష ఉన్న సంగతి తెలిసిందే. భారతీయులను బాత్రూంలు కడిగే పనివారిగా, బానిసలుగా, ఆత్మాహుతి బాంబర్లుగా ఐఎస్ వర్గాలు పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News