: టీవీ నటిపై వరకట్న వేధింపుల కేసు


టీవీ నటిపై వరకట్న వేధిపుల కేసు నమోదైంది. 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా భారతీయ టీవీ ప్రేక్షకులను పరిచితురాలైన స్మితా బన్సల్ పై ఆమె మరదలు మేఘా గుప్తా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. స్మితా సోదరుడు సౌరభ్ కు మేఘా గుప్తాతో 2009లో వివాహం జరిగింది. అనంతరం వారిరువురూ గుర్ గావ్ లో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి డబ్బు కోసం అత్తింటి వారు వేధిస్తున్నారంటూ మేఘా పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు నెలల క్రితం తన డబ్బు, నగలు లాగేసుకున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు కేసు నమోదు చేయని పోలీసులు తాజాగా వరకట్న వేధింపుల కేసును ఇప్పుడు నమోదు చేశారు. దీనిపై స్మిత స్పందించనప్పటికీ, ఆమె భర్త అంకుశ్ మాట్లాడుతూ, ఇంత వరకు పోలీసులు తమను విచారించలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News