: కాల్ మనీ నిందితుడు సత్యానంద్ కు ముందస్తు బెయిల్
ఏపీ కాల్ మనీ కేసులో నిందితుడు డీఈ సత్యానంద్ కు బెయిల్ మంజూరైంది. రూ.లక్ష పూచీకత్తుతో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సత్యానంద్ కు కోర్టు షరతు విధించింది. కాల్ మనీ కేసులో సత్యానంద్ మూడో నిందితుడిగా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన రౌడీ షీటర్, వ్యాపారి మాదంశెట్టి శివను ఆసుపత్రి నుంచి పోలీసులు జైలుకు తరలించారు.