: సరి-బేసి సంఖ్య ఫార్ములాకు నోటిఫికేషన్ విడుదల


దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ఏడాదిలో జనవరి ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న సరి-బేసి సంఖ్య ఫార్ములాకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వాయుకాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో వాహనం రిజిస్ట్రేషన్ సంఖ్యను బట్టి రోజు విడిచి రోజు ఆయా వాహనాలను రోడ్లపైకి అనుమతిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగం చేయబోతోంది. జనవరి 15 వరకు ఆ విధానాన్ని అమలుచేసి ఫలితాలను బట్టి తదుపరి అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సరి-బేసి విధానాన్ని సజావుగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్ అమలుకు సహకరిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ తెలిపారు.

  • Loading...

More Telugu News