: మరో 20 మంది తెలుగు విద్యార్థులను తిప్పిపంపిన అమెరికా అధికారులు
అమెరికా అధికారులు తాజాగా మరికొంతమంది విద్యార్థులను వెనక్కి పంపారు. విద్యాభ్యాసం కోసం వెళ్లిన 20 మంది తెలుగు విద్యార్థులను రెండు రోజుల కిందట (ఆదివారం) షికాగో ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు వారి ఎఫ్ 1 వీసాలను రద్దు చేసి తిప్పి పంపారు. వారిలో ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులున్నారు. గతవారం పలువురు విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపడం... విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన పడటం తెలిసిందే. అయితే కొన్ని యూనివర్సిటీలపై తాము నిషేధం విధించామని అమెరికా ప్రభుత్వం చెబుతుంటే, వర్సిటీలు మాత్రం అలాంటిదేమి లేదని చెప్పడం గమనార్హం.