: ఇన్ఫోసిస్ కేంపస్ లో దారుణం... క్యాంటీన్ క్యాషియర్ పై లైంగిక దాడి


దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు చెందిన పూణే కేంపస్ లో దారుణం చోటుచేసుకుంది. కేంపస్ లోని ఉద్యోగులకు భోజనం కోసం ఏర్పాటైన క్యాంటీన్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కాస్తంత ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు వ్యక్తులు సదరు మహిళపై క్యాంటీన్ లోనే అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనపై ఫిర్యాదునందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News