: కాల్ మనీ కేసులో నిందితులపై ఉక్కుపాదం మోపుతాం: మంత్రి ఉమ


రాష్ట్రంలోని కాల్ మనీ కేసులో నిందితులందరిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని అనంతపురంలో ఆయన మీడియాకు తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ వర్గం ప్రభుత్వంపై విషం కక్కుతోందని మంత్రి ఆరోపించారు. ప్రపంచ దేశాలు అమరావతి ఏర్పాటుకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ఉమ ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News