: ప్రైవేట్ బస్సులో వెండి మూటలు!... హైదరాబాదు వస్తుండగా షాద్ నగర్ లో పట్టివేత


నిన్న రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాదు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు, వారి లగేజీతో పాటు వెండి మూటలు కూడా దర్శనమిచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఎక్సైజ్ శాఖ పోలీసుల వాహనాల తనిఖీల్లో ఈ కొత్త తరహా స్మగ్లింగ్ వెలుగు చూసింది. కొత్తగా కనిపించిన మూటలు విప్పి చూసిన ఎక్సైజ్ శాఖ పోలీసులకు అందులో వెండి ముద్దలు కనిపించాయి. మూటల్లోని వెండి ముద్దలు చూసి షాక్ తిన్న పోలీసులు వాటిని తూకం వేయగా, ఆ ముద్దల బరువు 60 కిలోలుగా తేలింది. బెంగళూరు నుంచి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మార్గాల్లో ఈ వెండి హైదరాబాదుకు తరలివస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది.

  • Loading...

More Telugu News