: అమరావతికి ఆర్థిక సత్తా ఉంది!... భవిష్యత్తు చెప్పిన జపాన్ బృందం


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఆర్థిక సత్తా ఉందట. భవిష్యత్తులో ఆర్థికంగా అత్యంత బలీయమైన రాజధానిగా అమరావతి ఎదుగుతుందట. ఇదేదో అధికార పార్టీ టీడీపీ నేతలో, ఏపీ కేబినెట్ మంత్రులో ప్రకటించిన మాట కాదు. అమరావతిని అణువణువునా పరిశీలించిన జపాన్ బృందం చెప్పిన మాట. జపాన్ లోని టొమోమో రాష్ట్ర గవర్నర్ తకకాజు నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధి బృందం నిన్న అమరావతిలో పర్యటించింది. హెలికాప్టర్ ఎక్కిన తకకాజు మొత్తం అమరావతిపై విహంగ వీక్షణం చేయగా, ప్రతినిధులు మాత్రం రాజధానికి శంకుస్థాపన జరిగిన స్థలంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సూచనలు కనపడుతున్నాయని, మాస్టర్ ప్లాన్ రూపకల్పన కూడా చాలా బాగుందని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News