: బాలీవుడ్ కండలవీరుడిని కంటతడి పెట్టించిన సంజయ్ దత్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన 50వ పుట్టినరోజు వేడుకను నిన్న జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సల్మాన్ ని ఆశ్చర్యపరచాలనుకున్న ఆయన కుటుంబసభ్యులు, మిత్రులు ఒక వీడియోను సల్లూ భాయ్ కి అందజేశారు. ఆ వీడియో చూసిన కండలవీరుడు భావోద్వేగానికి గురై కంట తడిపెట్టాడని బాలీవుడ్ లైఫ్.కామ్ పేర్కొంది. ఇంతకీ, ఆ వీడియోలో ఏముందంటే.. సల్మాన్ గురించిన తమ భావాలను ఆయన సన్నిహితులు, స్కూల్ టీచర్లు, కుటుంబసభ్యులందరూ కలిసి ఆ వీడియోలో రికార్డు చేశారు. దీంతో పాటు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ రాసిన ఒక లెటర్ కూడా ఆ వీడియోలో ఉంది. ఆ లెటర్ ను చదివిన సల్మాన్ కన్నీటి పర్యంతమయ్యారని బాలీవుడ్ లైఫ్.కామ్ పేర్కొంది.