: కొత్త సంవత్సరంలో మోదీ, షరీఫ్ భేటీ అయ్యే అవకాశం?


భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వారిద్దరూ వచ్చే ఏడాది మార్చిలో వాషింగ్టన్ లో కలవనున్నట్టు సమాచారం. మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో అక్కడ అణుభద్రతపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్, పాక్ అధినేతలను కోరారు. ఈ సదస్సులో భాగంగానే మోదీ, షరీఫ్ లు కలుసుకుంటారని, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించుకుంటారని తెలుస్తోంది. ఇటీవలే షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా లాహోర్ లో కలసి, ప్రత్యేకంగా మోదీ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News