: కాల్ మనీ బాధితులకు వల్లభనేని వంశీ భరోసా


కాల్ మనీ బాధితులకు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భరోసా కల్పిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధితులు ఎవరైనా సరే తనను నేరుగా కలవొచ్చని... తనను కలసిన వారందరికీ అండగా ఉంటానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా విడిచి పెట్టబోమని... కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాల్ మనీ వ్యవహారాన్ని విచారించేందుకు స్పెషల్ కోర్టును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News