: గుర్గావ్ లో కళాశాల ముందే విద్యార్థిని కిడ్నాప్!


గుర్గావ్ ఎంజీ రోడ్డులోని 'గురు ద్రోణాచార్య' కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని ఆ కాలేజ్ గేట్ ముందే దుండగులు కిడ్నాప్ చేసిన సంఘటన సోమవారం ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సదరు విద్యార్థినిని బలవంతంగా కారులోకి లాక్కుపోయినట్లు చెప్పారు. కిడ్నాపర్లు కారులో విద్యార్థిని తీసుకుని పారిపోతుండగా ఆమెను రక్షించుకునేందుకని ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించినట్లు సమాచారం. కారుపై నంబరు ప్లేట్ లేదని సమీపంలో ఉన్నవారు చెప్పారు. కాగా, విద్యార్థిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News