: ఏపీకి 25 మంది ఐపీఎస్ లను కేటాయించండి... కేంద్రాన్ని కోరిన డీజీపీ రాముడు


ఆంధ్రప్రదేశ్ కు అదనంగా 25 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరినట్టు ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సంస్థల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు. ఢిల్లీలో ఈ మేరకు హోంశాఖ కార్యదర్శిని ఇవాళ డీజీపీ కలిశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, 2వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రానికి అదనంగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను కూడా కేటాయించాలని కోరినట్టు డీజీపీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News