: నాపై ఎలాంటి దాడి జరగలేదు: దానం నాగేందర్


ఇవాళ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్, ఆయన అనుచరులపై ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ దాడి చేశారంటూ ఈ మధ్యాహ్నం మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై దానం స్పందిస్తూ, తనపై ఎలాంటి దాడి జరగలేదని ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి స్పష్టం చేశారు. ఉప్పల్ లో తనపై దాడి జరిగినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు. స్థానిక కార్యకర్తల మధ్యే ఘర్షణ జరిగిందని, మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని తెలిపారు. మొదటి నుంచి రంగారెడ్డి, గ్రేటర్ మధ్య ఎప్పటినుంచో వివాదం ఉందని, అది ఇప్పటి గొడవకాదని అన్నారు. కాబట్టి అధిష్ఠానం చొరవ చూపి వివాదాన్ని పరిష్కరించాలని దానం కోరారు. జెండా మోసే వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తుందని దానం తెలిపారు.

  • Loading...

More Telugu News