: హిట్ అండ్ రన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత అరెస్ట్


పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో అధికార టీఎంసీ నేత పవిత్రా రాయ్ ను హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం రాయ్ ప్రయాణిస్తున్న కారు... సైకిల్ పై వెళుతున్న వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో 18 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... 20 ఏళ్ల మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును నిలపకుండా, వేగంగా వెళ్లేందుకు రాయ్ యత్నించాడు. అయితే, స్థానికులు కారును చుట్టుముట్టి ఆపేశారు. దీంతో, కారు లోపల నుంచే జనాలపైకి పవిత్రా రాయ్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఏమీ కాలేదు. ఘటన జరిగిన సమయంలో ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు కారులో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి రాయ్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News