: ఐటీ ఆధిపత్యమంతా భారతీయులదే: సత్య నాదెళ్ల


ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇండియన్స్ ఆధిపత్యం గణనీయంగా పెరుగుతోందని, దేశాభివృద్ధికి ఇది శుభసూచకమని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ శివార్లలోని టీ-హబ్ ను సందర్శించిన ఆయన, అక్కడ పలువురు ఔత్సాహికులను కలుసుకున్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే నైపుణ్యవంతులైన యువతకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఎంతో బాగుందని అన్నారు. టీ-హబ్ లో అందుతున్న సౌకర్యాలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, వందలాది స్టార్టప్ కంపెనీలను స్థాపిస్తున్న యువత, తమ లక్ష్యం ఏంటన్నది ముందుగానే నిర్దేశించుకుని సాగాలని సలహా ఇచ్చారు. లక్ష్య సాధనలో కొన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని, అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని అన్నారు.

  • Loading...

More Telugu News