: చంద్రబాబు ఐటీ సలహాదారుగా జేఏ చౌదరి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఐటీ సలహాదారుగా జేఏ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో సాఫ్ట్ వేర్ పార్క్ డైరెక్టర్ గా చౌదరి వ్యవహరించారు. అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఐటీ హబ్ గా మారేందుకు తన వంతు కృషి చేశారు. స్వతహాగా టీడీపీకి అభిమాని అయిన జేఏ చౌదరి... గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మద్దతుగా బస్ యాత్రను కూడా నిర్వహించారు. ఏదేమైనప్పటికీ... ఐటీ రంగాన్ని నవ్యాంధ్రప్రదేశ్ కు తీసుకు రావడంలో జేఏ చౌదరి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News