: తెలుగబ్బాయిపై మనసు పడ్డ చైనా యువతి... పారిపోయిన మనోడు!


'నువ్వే కావాలి' అంటూ ఓ చైనా యువతి తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన యువకుడిని ప్రేమించి, వివాహం చేసుకుంటానని ముందుకు రాగా, ఆ యువకుడు పరారైన ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, చైనాకు చెందిన జింగ్ జుంగ్ జాంగ్ (28) కల్కి ఆశ్రమానికి వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన మునిరాజు (22) అనే యువకుడు ఆశ్రమంలో పనిచేస్తున్నాడు. దాదాపు ఏడాదిగా ఆశ్రమంలోనే ఉంటున్న జింగ్ జుంగ్ కు, మునిరాజుకు మధ్య మంచి స్నేహమే ఉంది. అడపాదడపా మునిరాజుకు చైనా యువతి రూ. 10 లక్షల వరకూ ఇచ్చినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యువతి మునిరాజు ఇంటికి వచ్చి, తమకు వివాహం జరిపించాలని, మునిరాజును చైనాకు తీసుకెళ్తానని ప్రతిపాదించింది. దీంతో మునిరాజు తల్లిదండ్రులు అవాక్కవగా, మునిరాజు ఇంట్లో నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న చైనా ఎంబసీ అధికారులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి చైనాకు తిరిగి వెళ్లేందుకు అంగీకరింపజేశారు. పారిపోయిన మునిరాజును వెతికే పనిలో పోలీసులు పడ్డారు. కాగా, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, ప్రస్తుతం ఆమె ఆశ్రమంలో ఉండటం లేదని ఆశ్రమ అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News