: మజ్లిస్ పై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు...ఆ పార్టీ నేతలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కామెంట్
ఓల్డ్ సిటీ పార్టీగా పేరుపడ్డ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చనిపోతే, వారి శవయాత్రల్లో ఎంఐఎం నేతలు పాల్గొంటున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎంఐఎం నేతలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఐఎస్ శిక్షణ పొందిన ముస్లిం యువకులు హైదరాబాదులో చాలా మంది ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. నగరంలో ఉద్రవాద కార్యకలాపాలను నిరోధించాల్సిన కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్వీర్యంగా మారిపోయిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.