: మంచు దుప్పట్లో మన్యం... గజగజ వణుకుతున్న గిరిజనం!
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరిగింది. సూర్యుడు వచ్చినా మంచు తెరలు తొలగడం లేదు. లంబసింగి, మినుములూరుల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. చింతపల్లి, పాడేరులో 11 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో, గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మరోవైపు, దట్టంగా అలముకున్న మంచుతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండటంతోనే చలి తీవ్రత పెరిగిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో 5, మెదక్ లో 9, రామగుండంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.