: ఏపీ రాజధానికి బయలుదేరిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయుత మహా చండీయాగంలో ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం రాత్రి హైదరాబాదులోనే బస చేశారు. ఈ ఉదయం చంద్రబాబుతో ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. అనంతరం, హెలికాప్టర్ లో చంద్రబాబు విజయవాడకు బయల్దేరారు.