: నోటు ఒకటే... దానిపై నెంబర్లు మాత్రమే రెండు!


భారత కరెన్సీ నోట్ల ముద్రణ అత్యంత పకడ్బందీగా జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య మింట్ సిబ్బంది నోట్ల ముద్రణలో అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తారు. నోట్ల ముద్రణలో పొరపాట్లు దాదాపుగా కనిపించవు. ఇక నోట్లపై ఉన్న అక్షరాలు, నెంబర్ల విషయానికి వస్తే... అక్షరాల్లో మార్పులేవీ ఉండవు. కాని ఒక నోటుపై కనిపించే నెంబరు మరో నోటుపై కనిపించదు. అంతేకాక ఓ నోటుపై ముద్రించే నెంబరు... సదరు నోటుపై రెండు చోట్ల ఉన్నా, ఒకటిగానే ఉంటుంది. అయితే తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రాజ్ కు మాత్రం రెండు వేర్వేరు నెంబర్లు ఉన్న రూ.500 నోటు షాకిచ్చింది. దీపావళి ముందురోజు తాను రెండు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేశానని, వాటిని నిన్న లెక్కిస్తుండగా ఓ రూ.500 నోటుపై పై భాగంలో ‘ఐబీహెచ్ 768505’ నెంబరు ఉండగా, కింది భాగంలో ‘ఐబీహెచ్ 768506’ నెంబరు ఉండటాన్ని గుర్తించానన్నారు. ఈ నోటుకు సంబంధించి సోమవారం బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News