: నా ఇంటిలో సోదాలు చేస్తే... సీబీఐకి మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయి: కేజ్రీ కామెంట్


ఇటీవల తన వద్ద పనిచేసే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతిపై దర్యాప్తు పేరిట తన కార్యాలయంలో జరిగిన సీబీఐ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ సోదాలు తననేమీ చేయలేవని చెప్పిన కేజ్రీవాల్, తన ఇంటిలోనూ సోదాలు చేసుకోవచ్చని సెలవిచ్చారు. ఒకవేళ తన ఇంటిలో సోదాలు చేస్తే, సీబీఐ అధికారులకు కేవలం మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘మఫ్లర్ మ్యాన్’గా గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించిన కేజ్రీ, బీజేపీ సర్కారుకు షాకిస్తూ ఆ రాష్ట్ర సీఎం పీఠాన్ని వరుసగా రెండోసారి కైవసం చేసుకున్నారు. తాజాగా తన ఇంటిలో సోదాలు జరిగితే మఫ్లర్లు, అది కూడా ఆదాయపన్ను లెక్కల్లో చూపని నాలుగు మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News