: హైదరాబాదుకు సత్య నాదెళ్ల రాక నేడే!... చంద్రబాబుతో భేటీ, కేటీఆర్ తో కలిసి టీ హబ్ సందర్శన


ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల నేడు హైదరాబాదుకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు ప్రధానంగా ఈ భేటీ జరగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి ఆయన గచ్చిబౌలిలోని టీ హబ్ ను సందర్శిస్తారు. సర్కారీ ఇంక్యుబేటర్ గా భావిస్తున్న టీ హబ్ ను తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేంద్రంగా భావిస్తోంది. ఈ కేంద్రం తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలను సాకారం చేయనుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేంద్రాన్ని పరిశీలించనున్న సత్య నాదెళ్ల ప్రభుత్వానికి పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News