: చైనాలో ఒకే సంతానం విధానానికి స్వస్తి!


చైనాలో ఒకే సంతానం విధానానికి స్వస్తి పలికారు. ఆ దేశంలో జనాభాను నియంత్రించడానికి కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ విధానానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇకపై ప్రతిజంట ఇద్దరు పిల్లలకు జన్మనివ్వవచ్చని చైనా ప్రభుత్వం పేర్కొంది. ఈ పాలసీని గత అక్టోబరులోనే చైనా ప్రభుత్వం ప్రకటించింది. కాగా, చైనాలో ఒకే సంతానం పాలసీ ఇన్నాళ్లు అమల్లో ఉండటానికి కారణాలు అక్కడి పేదరికం, అధిక జనాభా. దీంతో 1970 దశకాల్లో దంపతులకు ఒక జంటకు ఒకే బిడ్డ పాలసీని అమలు చేశారు. ఆ తర్వాత చైనాలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం జరిగింది. అంతేకాకుండా రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా చట్ట సవరణలు చేయాలనే డిమాండ్లు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక జంట రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చేందుకు వీలుగా బిల్లు ఆమోదం పొందింది.

  • Loading...

More Telugu News