: యాగం విజయవంతానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పాదాభివందనం: కేసీఆర్


'అయుత చండీ మహాయాగం విజయవంతానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నాను' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యాగం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ,‘భారతీ తీర్థుల పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఐదురోజులు ఈ మహా యాగానికి శ్రమించిన ప్రతి కార్యకర్త పాదాలకు, వండి వార్చిన బ్రాహ్మణులకు నమస్కరిస్తున్నాను. యాగ నిర్వహణలో చిన్నా, చితకా ఆటంకాలు వస్తే బాధ పడద్దు అని శృంగేరి పీఠాధిపతి నాడు చెప్పారు. లోక కల్యాణం, విశ్వశాంతి, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే ఈ యాగం చేశాను. అమ్మ దయ చూపింది. చాలా పట్టుదలగా రుత్విక్కులు చేశారు. నేను ఇచ్చే సంభావన నూలుపోగుతో సమానం. ధర్మం జయిస్తుంది. అధర్మం తప్పకుండా ఓటమి పాలవుతుంది’ అన్నారు కేసీఆర్.

  • Loading...

More Telugu News