: పేదలకు మరింత దగ్గరగా ఖరీదైన వైద్యం: కామినేని
జనవరి 1 నుంచి పేదలకు మరిన్ని ఆరోగ్య వైద్య సేవలను దగ్గర చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గుంటూరులో సెయింట్ జోసఫ్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ విభాగాన్ని ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పేదలకు భారంగా మారుతున్న అధునాతన వైద్యాన్ని వారికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 5 రకాల వైద్య సేవలను అందించనున్నామని, అందులో భాగంగా, ఉచిత డయాగ్నసిస్, టెలీ రేడియాలజీ, సీటీ స్కాన్ సేవలు అందుతాయని వివరించారు. గర్భిణులు కాన్పు తరువాత, బిడ్డతో కలసి ఉచితంగా ఇంటికి చేరేలా కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు కామినేని పేర్కొన్నారు.