: ఎర్రవల్లికి కదిలిన చంద్ర దండు... మహాచండికి కనకదుర్గ కానుకలు
కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహాచండీ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులతో పాటు బయలుదేరి వెళ్లారు. యాగంలో గత నాలుగు రోజులు ఒక ఎత్తుకాగా, చివరిదైన నేడు ఒక్కటీ ఒక ఎత్తు. అద్భుత రీతిలో మహా పూర్ణాహుతికి ఏర్పాట్లు జరుగగా, మరో అరగంటలో ఎర్రవల్లి చేరుకునే బాబు బృందం సాయంత్రం వరకూ అక్కడే గడపనుంది. మహాచండీకి కానుకలుగా, విజయవాడ కనకదుర్గమ్మ నుంచి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను చంద్రబాబు ప్రత్యేకంగా తెప్పించి, పూర్ణాహుతిలో కలపనున్నారు. కాగా, మహా పూర్ణాహుతిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పాల్గొననున్న సంగతి తెలిసిందే.