: మసీదుపై దాడి చేసిన ఫ్రాన్స్ వాసులు!


ఫ్రాన్స్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రదాడుల తరువాత, ఆ దేశ వాసుల్లో ముస్లింలపై అసహనం పెరుగుతోంది. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోర్సికాలోని మసీదుపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం నుంచి అక్కడ చిన్న చిన్న ఘటనలు, స్వల్ప ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని సమాచారం. భద్రతా దళాలు బందోబస్తు నిర్వహిస్తున్నా, మసీదు విధ్వంసం జరగడంతో ఇక్కడి ముస్లింలు భయాందోళనలు చెందుతున్నారు. ఆందోళనకారులు పోలీసులు, ఫైర్ ఫైటర్లపైనా దాడులకు దిగారు. ఫ్రాన్స్ ప్రధాని మాన్యువెల్ వాల్స్ ఈ ఘటనను ఖండించారు. మిగతా మసీదులకు భద్రత పెంచుతున్నట్టు తెలిపారు. ప్రజలు చట్టాలకు కట్టుబడివుండాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News