: హైదరాబాదులో దారుణం... రియల్టర్ ను హత్య చేసి లొంగిపోయిన నిందితులు
హైదరాబాద్ లోని బేగంపేటలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఓ రియల్టర్ ను హత్య చేసిన దుండగులు, ఆపై తాపీగా పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. ఓ స్థలం విషయంలో నడుస్తున్న వివాదమే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రియాజ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తుండగా, శనివారం రాత్రి ఆయన్ను చుట్టుముట్టిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ ఘటనలో రియాజ్ అక్కడికక్కడే మరణించగా, ఆపై నిందితులు లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.