: యాగఫలం దక్కాలంటే ఇక్కడే పడుకోవాలని కేసీఆర్ కు పండితుల సలహా!
అయుత మహా చండీయాగం నేటితో ముగియనుండటంతో, యాగఫలం దక్కాలంటే, కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో పాటు, నేటి రాత్రి యాగశాలలోనే నిద్రించాలని పండితులు సూచించడంతో, ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు కుటుంబాల్లోని వారంతా యాగశాలలోనే నిద్రించనున్నారు. చండీయాగంతో పాటు మహా రుద్రయాగం కూడా చేసినందున, యాగనిద్ర తప్పనిసరని పండితులు సూచించినందున కేసీఆర్ అందుకు అంగీకరించారు. ఆపై కేసీఆర్ కుటుంబమంతా సోమవారం ఉదయాన్నే వేములవాడకు వెళ్లి, శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకోనున్నారు.