: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి దేశాధ్యక్షుడు హితబోధ!


ఆత్మహత్యకు యత్నిస్తున్న ఒక వ్యక్తిని ఆ దేశాధ్యక్షుడే కాపాడిన సంఘటన టర్కీలో జరిగింది. టర్కీలోని ఇస్తాంబుల్ లోని బొస్పొరస్ బ్రిడ్జి ఆత్మహత్యలకు పేరుగాంచిన బ్రిడ్జి. దీని ఎత్తు సుమారు 211 అడుగులు. ఆత్మహత్యలు చేసుకునే వారు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. అలాగే శుక్రవారం నాడు సుమారు 30 సంవత్సరాల వయస్సున్న వెరిజ్ కాక్రస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించాడు. సరిగ్గా అదే సమయంలో టర్కీ దేశాధ్యక్షుడు రీసిప్‌ త్యాప్‌ ఈర్డోగన్‌ కాన్వాయ్ ఆ బ్రిడ్జిపై వెళుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే కారు ఆపమని చెప్పడంతో.. ఆయన కాన్వాయ్ ఆగింది. వెంటనే భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ‘ఆత్మహత్య చేసుకోవద్దు’ అంటూ వారు కేకలు వేయడంతో సదరు వ్యక్తి ఆగిపోయి, వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే.. అతన్ని తీసుకుని అధ్యక్షుని కారు వద్దకు తీసుకెళ్లారు. కారులో కూర్చుని ఉన్న రీసిప్‌ కు అతను షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కొద్ది సేపటి తర్వాత, అధ్యక్షుడి చేతిని అతను ముద్దుపెట్టుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా అతను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అతనికి సహాయం చేస్తామని అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో, ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిన ఆ యువకుడు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు.

  • Loading...

More Telugu News