: క్రిస్మస్ రోజు ‘అక్కినేని’ కుటుంబం దిగిన ఫొటో ఇదే!


క్రిస్మస్ పర్వదినం నాడు అక్కినేని కుటుంబ సభ్యులంతా కలుసుకున్నారు. అనంతరం వారందరూ కలిసి ఒక ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోను యువహీరో అఖిల్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలని, ఈ ఫొటోను క్రిస్మస్ రోజు సాయంత్రం తమ కుటుంబ సభ్యులందరం కలిసి దిగామని, తమ వెనుక ఉన్న గోడపై తాత అక్కినేని, నాయనమ్మ అన్నపూర్ణల ఫొటో ఒకటి ఉందని ట్వీట్ చేశాడు. కాగా, ఈ ఫొటోలో నాగార్జున, అమల, నాగ సుశీల, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News