: ఓటు ఎవరికి వేశారో చెప్పినా నేరమే: భన్వర్ లాల్


తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశారో బయటకు చెప్పినా నేరమే అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు. నాలుగు జిల్లాలలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో భన్వర్ లాల్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని... ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News