: ఉప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు హైస్పీడ్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు సమస్య పరిష్కారమైంది. సుల్తాన్ బజార్ ప్రాంతంలో నెలకొన్న సమస్యను పరిష్కరించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 63 శాతం మెట్రో పనులు పూర్తయ్యాయని చెప్పారు. అంతేకాకుండా, హైదరాబాద్ శివారు ఉప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు హై స్పీడ్ మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని వెల్లడించారు. దీనికోసం ఇప్పటికే ఎకరా స్థలం కూడా తీసుకున్నామని చెప్పారు.