: స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 25,690కి చేరింది. నిన్నటితో పోలిస్తే రూ. 15 పెరిగింది. రీటెయిల్ కొనుగోళ్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ధర పెరిగినట్టు బులియన్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు, కేజీ వెండి ధర రూ. 25 తగ్గి రూ. 34,300కి చేరింది. నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు మద్దతు తగ్గడంతో వెండి ధర తగ్గింది.